సీఎస్కే నుండి 12 మంది ఆటగాళ్లు అవుట్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకుంది.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 8:10 PM IST

సీఎస్కే నుండి 12 మంది ఆటగాళ్లు అవుట్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 12 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. ఇక రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేశారు. శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరానను కూడా విడుదల చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంది. శివమ్ దూబేను సీఎస్‌కే వదులుకోలేదు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అన్షుల్ కంబోజ్‌ను కూడా రిటైన్ చేసుకుంది.

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి.

విడుదల చేసిన ఆటగాళ్లు:

మతీశ పతిరాన, రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్ నాగర్‌కోటి

Next Story