ఐపీఎల్ వేలంపాట నిర్వహిస్తున్న చారు శర్మ

Charu Sharma to conduct the IPL 2022 mega auction. ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా

By Medi Samrat  Published on  12 Feb 2022 10:45 AM GMT
ఐపీఎల్ వేలంపాట నిర్వహిస్తున్న చారు శర్మ

ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. హసరంగాకు సంబంధించి వేలంపాట నిర్వహిస్తూ ఆయన ఉన్నట్టుండి ముందుకు వాలిపోయారు. ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో టీవీ చానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు. ఎడ్మీయడస్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. హ్యూ ఎడ్మీయడస్ బ్రిటన్ జాతీయుడు. 2018 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించగా, అతడి స్థానంలో ఎడ్మీయడస్ వేలం నిర్వహణ చేపట్టారు.

ఇక ఈ ఐపీఎల్ పాటను చారు శర్మ నిర్వహిస్తూ ఉన్నారు. చారు శర్మ ప్రముఖ టీవీ పర్సనాలిటీ అనే విషయం తెలిసిందే..! "Mr. Hugh Edmeades, the IPL Auctioneer, had an unfortunate fall due to Postural Hypotension during the IPL Auction this afternoon. The medical team attended to him immediately after the incident & he is stable. Mr. Charu Sharma will continue with the Auction proceedings today," అంటూ ఐపీఎల్ ట్వీట్ చేసింది.

Next Story
Share it