భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ కారణంగా ఈ టోర్నీ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది.
By Medi Samrat Published on 11 Nov 2024 6:21 PM ISTవచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ కారణంగా ఈ టోర్నీ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతే కాదు.. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదని భారత మాజీ క్రికెటర్ చెప్పాడు.
భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. పొరుగు దేశానికి వెళ్లేందుకు భారత్ విముఖత చూపుతున్నట్లు ఐసీసీ నుంచి తమకు ఈమెయిల్ వచ్చిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ధృవీకరించింది. పీసీబీ ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ప్రభుత్వ సలహా కోసం వేచి ఉంది. భారత జట్టు టోర్నీలో పాల్గొనకపోతే దాని ఆర్థికపరమైన చిక్కులు కూడా కనిపిస్తాయి.
తన యూట్యూబ్ ఛానెల్‌లో, ఆకాష్ చోప్రా.. “ఇది ICC ఈవెంట్, ఈ ఈవెంట్‌కు డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఐసిసి భారత జట్టు భాగస్వామ్యాన్ని నిర్ధారించలేకపోతే.. ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టరు లేదా ఆర్థిక రీవాల్యుయేషన్ చేయరు. భారత జట్టు టోర్నీలో పాల్గొనకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా 'మేం శత్రు దేశానికి వెళ్తున్నాం' అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పిందని.. భవిష్యత్తులో భారత్‌తో ఆడకూడదని పాకిస్థాన్ నిర్ణయించుకుంటే.. అది ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుందని చోప్రా అన్నాడు. పాకిస్థాన్‌కు వెళ్లకపోతే భారత్‌కు కూడా కష్టాలు తప్పవని, ఆంక్షలు ఆర్థికంగానే ఉంటాయని, భారత్‌కు వచ్చే డబ్బును ఐసీసీ ఎలా అడ్డుకుంటుంది? పాకిస్థాన్‌కు అంత సామర్థ్యం లేదు. ఇదీ చేదు వాస్తవం. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పాకిస్థాన్‌తో సహా ప్రతి జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుంది. భారత ప్రభుత్వం తమ జట్టును పాకిస్తాన్‌కు వెళ్లనివ్వకూడదని నిర్ణయించినట్లయితే.. జట్టు రాలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వాస్తవికత తెలుసు.. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ సాధ్యం కాదు. భారత్ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి