'వైరల్'గా మారిన చాహల్ హనీమూన్ ఫోటో!

Chahal Honeymoon Pic get Viral. టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర సింగ్ చాహల్ గత కొద్ది రోజుల క్రితం తన వైవాహిక‌

By Medi Samrat  Published on  30 Dec 2020 1:10 PM IST
వైరల్గా మారిన చాహల్ హనీమూన్ ఫోటో!

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర సింగ్ చాహల్ గత కొద్ది రోజుల క్రితం తన వైవాహిక‌ జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. చాహల్ కేవలం అంతర్జాతీయ క్రికెట్ ఆడ‌ట‌మే కాదు.. అంత‌కుముందు మాజీ చేస్ అంతర్జాతీయ ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించారు. టి20 క్రికెట్ చరిత్రలో ఆరు వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా, తొలి భారతీయుడిగా చాహల్ నిలిచారు. అయితే ప్రస్తుతం క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకుని తన కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన చాహల్.. ఎంజాయ్ చేయడానికి హనీమూన్ వెళ్లారు.

చాహల్ ప్ర‌స్తుతం హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే చాహ‌ల్ దంప‌తులు వారికి సంబంధించిన ఫోటోలను తమ‌ అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తమ హనీమూన్ కు సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటో ను తన అభిమానులతో పంచుకున్నారు ఈ జంట‌. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్ లో ఓ హోటల్ లో తన భార్య ధనశ్రీ తో కలిసి దిగిన ఫోటోను చాహల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇప్పటికే ఈ ఫోటో లక్షల్లో వ్యూస్‌ దక్కించుకుంది.



ఇదిలావుంటే.. యుజ్వేంద్ర సింగ్ చాహల్ డిసెంబర్ 22న ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్, యూట్యూబ్ స్టార్ట్ అయిన ధనశ్రీ ను వివాహమాడారు. వీరి వివాహం ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లిన ఈ జంట అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story