తను 10 ఏళ్లలో చూసిన కష్టాల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు
డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 2:39 AM GMTడర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ విజయానికి సంజూ శాంసన్ బ్యాటింగే కారణం. సంజూ 214 స్ట్రైక్ రేట్‌తో 50 బంతుల్లో 107 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు కూడా బాదాడు. ఈ మ్యాచ్‌లో సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను డర్బన్‌లో భారత జట్టు రికార్డు గురించి అడిగారు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి రికార్డు గురించి నాకు తెలియదు.. ఇప్పుడే దాని గురించి తెలుసుకున్నాను. గత 3-4 సిరీస్‌లో క్రికెట్ బ్రాండ్‌ను మార్చలేదు.. మాకు చాలా గర్వంగా ఉంది. ఈ విజయం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
సంజూ శాంసన్ ఇన్నింగ్స్ గురించి సూర్య మాట్లాడుతూ.. "గత 10 సంవత్సరాలలో అతను చూసిన అన్ని కష్టాల ఫలాలను అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సంజూ 90 వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా బౌండరీలు కొట్టడానికి ప్రయత్నించాడు. అతని కోసం కాకుండా జట్టు కోసం ఆడాడని కొనియాడాడు.
మ్యాచ్ ప్రణాళిక గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మేము క్లాసెన్, మిల్లర్ వికెట్ల కోసం చూస్తున్నాం. భారత స్పిన్నర్ల ప్రదర్శన అద్భుతమైనది. టాస్, విలేకరుల సమావేశంలో నేను ఇప్పటికే చెప్పినట్లుగా.. ఆటగాళ్లు నా పనిని సులభతరం చేసారు. నేను ఎక్కువ లోడ్ తీసుకోవలసిన అవసరం లేదు. ఆటగాళ్ళు మైదానంలో, వెలుపల సరదాగా గడుపుతున్నారు, ఇది నా పనిని సులభతరం చేస్తుంది. మనం ఆడే క్రికెట్‌లో కొన్ని వికెట్లు కోల్పోయినా ఎలాంటి భయం లేకుండా ఆడాలనుకుంటున్నాం.. ఇది T20 గేమ్.. 17 ఓవర్లలో 200 పరుగులు చేయగలిగినప్పుడు సమస్య ఏముంటుందని వ్యాఖ్యానించాడు.