డ్రీమ్ కంబ్యాక్ ఇచ్చిన బుమ్రా.. మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు

జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు భారత జట్టులోకి వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  18 Aug 2023 2:20 PM GMT
డ్రీమ్ కంబ్యాక్ ఇచ్చిన బుమ్రా.. మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు

జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు భారత జట్టులోకి వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సమయంలో బుమ్రాను ఐర్లాండ్ లో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేశారు. కెప్టెన్ గా బుమ్రాను ఎంపిక చేసి.. యువకులతో కూడిన టీమ్ ను పంపారు. మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్ వేసిన బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో అభిమానులను మురిపించాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టించుకున్న బుమ్రా ఆ తర్వాతి బంతికి ఆండ్రూ బాల్బర్నీని బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో 5 బంతికి టకర్ ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్ లో స్కూప్ ఆడాలని ప్రయత్నించిన టకర్.. సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

జస్ప్రిత్ బుమ్రా టీ20ల్లో టీమిండియాకి కెప్టెన్సీ చేస్తున్న మొట్టమొదటి స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. గాయంతో ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ప్రసిద్ధ్ కృష్ణ, నేటి మ్యాచ్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేశాడు.

భారత్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(c), రవి బిష్ణోయ్

డ్రీమ్ కంబ్యాక్ ఇచ్చిన బుమ్రా.. మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు

పాల్ స్టిర్లింగ్(సి), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

Next Story