IPL 2026 మినీ వేలం అబుదాబిలో జరుగుతోంది. వేలంలో ఆస్ట్రేలియన్ ఆటగాడు కామెరాన్ గ్రీన్‌ను KKR రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐసీఎల్ వేలం చరిత్రలో గ్రీన్ అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే 2024లో రూ.24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు. అదే సమయంలో వెంకటేష్ అయ్యర్‌ను RCB 7 కోట్లకు కొనుగోలు చేసింది.
31 మార్చి 2026 నుండి ప్రారంభమయ్యే IPL 19వ సీజన్‌కు సంబంధించి ఈ మినీ వేలం జరుగుతుంది. వేలంలో దాదాపు 369 మంది ఆటగాళ్ల భవితవ్యం తేలనుంది. వీరిలో 77 మంది మాత్రమే IPL 2026లో ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఈ మినీ వేలంలో రూ.64.3 కోట్ల భారీ పర్స్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా రూ. 43.4 కోట్లతో చాలా మంది పెద్ద ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వేలంలో దిగింది. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను ముంబై ఇండియన్స్ తన ప్రాథమిక ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.