మొహమ్మద్ సిరాజ్ కు ఉద్యోగం.. ఏ స్థాయిలో తెలుసా.?

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది

By Medi Samrat  Published on  1 Aug 2024 3:00 PM GMT
మొహమ్మద్ సిరాజ్ కు ఉద్యోగం.. ఏ స్థాయిలో తెలుసా.?

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌, రెండుసార్లు ప్రపంచ బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌లకు గ్రూప్‌-1 ఉద్యోగం కల్పించే ప్రతిపాదనను మంత్రివర్గంలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే వీరికి ఉద్యోగాలు ఇవ్వడానికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

జులై 31 బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత క్రికెట్ జట్టులో భాగంగా ఉన్న మొహమ్మద్ సిరాజ్ పాత్రను ఆయన హైలైట్ చేశారు. T20 ప్రపంచ కప్ విజయంలో సిరాజ్ సహకారాన్ని కూడా గుర్తు చేశారు. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాన్ని మంజూరు చేస్తుందని, అతను పోలీసు శాఖలో చేరాలని ఎంచుకుంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) వంటి ఉన్నత పదవులలో నేరుగా ప్రవేశం కల్పిస్తుందని చెప్పారు. బాక్సర్ నిఖత్ జరీన్ 2022, 2023లో రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలను గెలుచుకోవడంతో సహా అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఆమెను నియమించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి విమర్శించారు.

Next Story