సిడ్ని టెస్టులో ఓటమి తప్పించుకున్నామనే ఆనందంలో ఉన్న భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆసీస్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. సిడ్ని టెస్టులో ఆడిన ఆటగాళ్లలో మరో ముగ్గురు చివరి టెస్టుకు దూరం అయ్యారు. ఐపీఎల్‌లో గాయపడిన ఇషాంత్ అసలు సిరీస్‌కే రాలేదు. తొలి టెస్ట్ మ్యాచ్ లో షమీ రెండో టెస్టులో ఉమేష్ యాదవ్, ప్రాక్టీస్ చేస్తుండగా.. కే ఎల్ రాహుల్ గాయాల బారిన పడి సిరీస్‌కు దూరం అవగా.. తాజాగా తొడకండరాల గాయంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి, బొటనవేలు గాయంతో జడేజా తప్పుకున్నారు.
ఇక అనుభవలేమి బౌలింగ్‌ను దశ నిర్దేశం చేస్తూ.. బౌలింగ్‌లో వెన్నముకగా ఉన్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా దూరం కానున్నాడు. కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న అతను తదుపరి మ్యాచ్ ఆటం లేదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. అయితే బుమ్రా గైర్హాజరీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ బుమ్రా దూరమైతే భారత్‌కు కష్టాలు తప్పవు.
ఇక జట్టులో ఉన్న వికెట్ కీపర్ పంత్, స్పిన్నర్ అశ్విన్ కూడా స్వల్పగాయాలతో సతమతమవుతున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బ్రిస్బేన్ వేదికగా 15 నుంచి జరగనున్న నాలుగో టెస్టులో భారత్ ఏ మేరకు రాణిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా ఒకవేళ మ్యాచ్‌కు దూరం అయితే.. అతడి స్థానంలో నటరాజ్ తుది జట్టులోకి రావచ్చు. జడేజా స్థానంలో శార్ఠాల్ ఠాకుర్ రానున్నాడు.