ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాక్ స్పిన్నర్ నోమాన్ అలీ రెండో స్థానానికి చేరుకున్నాడు. బుమ్రాకు, పాక్ బౌలర్ కు మధ్య అంతరం 29 పాయింట్లు మాత్రమే. దక్షిణాఫ్రికాతో లాహోర్‌లో జరిగిన టెస్టులో నోమాన్ అలీ 10 వికెట్ల ప్రదర్శన చేయడంతో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 853 రేటింగ్ పాయింట్లతో కెరీర్‌లోనే అత్యుత్తమ రెండో ర్యాంకును అందుకున్నాడు.
ఇక భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏడాది తర్వాత వన్డే ఆడిన సిరాజ్, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచి నేరుగా 17వ స్థానంలో నిలిచాడు.