ఒలింపిక్స్.. ఎన్నో అద్భుతమైన క్రీడలకు స్థానం కల్పించారు. ప్రాచుర్యం పొందిన ఆటలను, క్రీడలను ఎప్పటికప్పుడు ఒలింపిక్స్ లో చేరుస్తూ వస్తున్నారు, తాజాగా ఒలింపిక్స్ లో బ్రేక్ డ్యాన్స్ కు అవకాశం కలిపించారు. పాశ్చాత్యదేశాల్లో మొదలైన బ్రేక్ డ్యాన్సింగ్ స్టయిల్ కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్ పట్ల యువతలో మరింత క్రేజ్ తీసుకువచ్చే క్రమంలో బ్రేక్ డ్యాన్స్ ను ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది.
2024లో పారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడల ద్వారా బ్రేక్ డ్యాన్స్ అరంగేట్రం చేయనుంది. టోక్యోలో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ ద్వారా మూడు కొత్త క్రీడాంశాలను పరిచయం చేయనున్నారు. స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలు కూడా ఒలింపిక్ క్రీడల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఒక ఏడాది పాటు వాయిదా వేశారు.