నాలుగు మార్పులతో బరిలోకి.. పంత్, జడేజా ఇన్.. రాహుల్‌కు దక్కని చోటు
Boxing Day Test: Jadeja to return; Gill, Siraj to debut. బాక్సిండే టెస్టుకు ఒక రోజు ముందే టీమ్ఇండియా తుది జట్టును
By Medi Samrat
బాక్సిండే టెస్టుకు ఒక రోజు ముందే టీమ్ఇండియా తుది జట్టును ప్రకటించింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్.. రెండో టెస్టులో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. అందరూ ఊహించినట్లుగానే తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీషా పై వేటు పడింది. అతడి స్థానంలో శుభమన్ గిల్ రాగా.. షమి స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరు టెస్టుల్లో అరగ్రేటం చేయడం ఖాయమైంది.
ALERT🚨: #TeamIndia for 2nd Test of the Border-Gavaskar Trophy against Australia to be played in MCG from tomorrow announced. #AUSvIND pic.twitter.com/4g1q3DJmm7
— BCCI (@BCCI) December 25, 2020
కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రెండు విభాగాల్లో విఫలమైన సాహా స్థానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపిన రిషబ్‌పంత్‌ను ఎంపిక చేశారు. ఇక విరాట్ కోహ్లీ స్థానంలో ఖచ్చితంగా తుది జట్టులో ఉంటాడని అనుకున్నకేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. బౌలింగ్‌ను పటిష్టం చేయాలని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు. విరాట్ గైర్హజరీలో భారత జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తుండగా.. పుజారా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
భారత జట్టు : అజింక్య రహానే(కెప్టెన్), మయంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), హనుమ విహారీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్