వైభవ్ సూర్యవంశీకి రూ.10 ల‌క్ష‌ల నగదు ప్రోత్సాహకం ప్ర‌క‌టించిన సీఎం

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై చారిత్రాత్మక సెంచరీ చేసినందుకు 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి రివార్డ్ ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయించారు

By Medi Samrat
Published on : 29 April 2025 3:10 PM IST

వైభవ్ సూర్యవంశీకి రూ.10 ల‌క్ష‌ల నగదు ప్రోత్సాహకం ప్ర‌క‌టించిన సీఎం

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై చారిత్రాత్మక సెంచరీ చేసినందుకు 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి రివార్డ్ ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయించారు. వైభవ్‌కు బీహార్ ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సాధించిన అసాధారణ విజయాన్ని సీఎం నితీశ్ ప్రశంసించారు. ఇది బీహార్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.

సిఎం నితీష్ కుమార్ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశంలో.. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన (14 సంవత్సరాలు) బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు మరియు శుభాకాంక్షలు. తన కఠోర శ్రమ, ప్రతిభ కారణంగా భారత క్రికెట్‌కు కొత్త ఆశాకిరణంగా మారాడు. అందరూ అతనిని చూసి గర్వపడుతున్నారు. నేను 2024 సంవత్సరంలో 1 అన్నే మార్గ్‌లో వైభవ్ సూర్యవంశీ, అతని తండ్రిని కలిశాను. ఆ సమయంలో నేను అత‌డికి ఉజ్వల భవిష్యత్తును ప్ర‌సాదించాల‌ని కోరుకున్నాను. 'ఐపీఎల్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, మేము అతనితో ఫోన్‌లో మాట్లాడి అభినందించాము. బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ప్రోత్సాహ‌కం ఇవ్వనుంది. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టులో కొత్త రికార్డులు సృష్టించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

బీహార్‌కు చెందిన సూర్యవంశీ సోమవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో T-20 సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా, IPL చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయ‌డం ద్వారా రాజస్థాన్ రాయల్స్ గెలుపుకు బాట‌లు వేశాడు.

Next Story