భారత్‌తో మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌కు బిగ్‌షాక్‌.. స్టార్‌ బ్యాటర్‌ దూరం!

భారత్‌తో మ్యాచ్‌ కు ముందు పాకిస్థాన్‌కు మరో షాక్‌ ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  8 Jun 2024 8:01 PM IST
big shock,  pakistan, cricket, t20 world cup,

 భారత్‌తో మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌కు బిగ్‌షాక్‌.. స్టార్‌ బ్యాటర్‌ దూరం!

టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌ తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ టోర్నీలో మంచి ఆరంభం దక్కకపోవడంతో ఆ టీమ్‌కు షాక్‌ ఎదురైంది. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు అయ్యింది. భారత్‌తో మ్యాచ్‌ కు ముందు పాకిస్థాన్‌కు మరో షాక్‌ ఎదురైంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇమాద్ వసీం గాయంతో మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం.. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఆడలేదు. మరి ఆదివారం న్యూయార్క్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ ఆడేందుకు ఇమాద్ వసీం పెయిన్‌ కిల్లర్స్‌.. ఇంజెక్షన్లు తీసుకున్నట్లు పాక్‌ మీడియా తెలిపింది. కానీ.. అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని.. ఈ మేరకు అతను భారత్‌ మ్యాచ్‌లో ఆడేది కష్టమే అంటున్నాయి పాక్‌ జాతీయ మీడియా కథనాలు. ఇమాద్ వసీం గైర్హాజరీలో భారత్‌తో మ్యాచ్‌లో సయిమ్ ఆయూబ్, మహమ్మద్ రిజ్వాన్‌లు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

అమెరికాతో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడింది. సూపర్‌ ఓవర్‌లో ఓటమిని చవి చూసింది. ఈ పరాజయంతో పాక్‌కు తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సూపర్ -8 చేరాలంటే ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో ఓడితే దాదాపు పాక్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలిచి.. మంచి ఆరంభాన్ని అందుకుంది. ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

Next Story