Video : గంటకు 156.7 కిలోమీటర్ల వేగం.. లక్నో జట్టులోకి వచ్చేసిన స్పీడ్ గన్..!
లక్నో సూపర్ జెయింట్స్‌కి ఓ శుభవార్త అందింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
By Medi Samrat
లక్నో సూపర్ జెయింట్స్‌కి ఓ శుభవార్త అందింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మేరకు LSG వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక ప్రత్యేక వీడియోతో మయాంక్ తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. మయాంక్ అరంగేట్రం LSG బౌలింగ్ ఎటాక్‌ను మరింత బలోపేతం చేస్తుంది.
వెన్ను, కాలు గాయం కారణంగా మయాంక్ ఇప్పటి వరకు టీమ్ ఇండియా, LSG IPL 2025 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీలో మయాంక్ పునరావాసం పొందుతున్నాడు. అయితే, 22 ఏళ్ల మయాంక్ ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే LSG రాబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండేందుకు మంగళవారం రాత్రి టీమ్ బస చేస్తున్న హోటల్‌లోకి ప్రవేశించాడు.
⚡ 𝐌𝐀𝐘𝐀𝐍𝐊 ⚡ 𝐘𝐀𝐃𝐀𝐕 ⚡ 𝐈𝐒 ⚡ 𝐁𝐀𝐂𝐊 ⚡ pic.twitter.com/c0G5p3svMA
— Lucknow Super Giants (@LucknowIPL) April 16, 2025
IPL 2024లో అతడి ప్రదర్శనతో బంగ్లాదేశ్ సిరీస్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు అందింది. ఆ సిరీస్‌లో మయాంక్ 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడు గజ్జ స్ట్రెయిన్ గాయం కారణంగా IPL 2025 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. చాలా నెలల పునరావాసం తర్వాత.. మయాంక్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే కీలక పోరులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే.. ఎల్‌ఎస్‌జి వైద్య బృందం నుంచి తుది జట్టులో చోటు కల్పిస్తుందా.. లేదా అనేది చూడాలి.
ఇక IPL 2025లో పేలవమైన ప్రారంభం నుండి LSG కోలుకుని 4 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. అయితే వారి బౌలింగ్ ఆందోళన కలిగించే అంశం. మయాంక్ యాదవ్ గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరే పేస్ బౌలర్. మయాంక్ తిరిగి రావడం వల్ల ఈ సమస్యకు సకాలంలో పరిష్కారం లభిస్తుంది.