ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత జట్టు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ చేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన కిషన్ తర్వాతి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్‌గా కిషన్, శ్రీకర్ భరత్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పుడు గాయం కారణంగా జట్టు సెలక్షన్‌కు కిషన్ అందుబాటులో లేకపోతే భరత్‌కు చోటు దక్కినట్లే అని అంటున్నారు.
మ్యాచ్ జూన్ 7 నుండి 11 వరకు జరుగుతుంది. ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా ఆటగాళ్లందరూ లండన్‌లోని అరండేల్ క్యాజిల్ క్రికెట్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ICC నిబంధనల ప్రకారం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ డ్రాగా ముగిస్తే, రెండు జట్లను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఒకవేళ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగితే, గత సంవత్సరం ఎడిషన్ లాగా రిజర్వ్ డే ఉంటుంది.