Champions Trophy-2025 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..!

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat
Published on : 18 Feb 2025 2:59 PM IST

Champions Trophy-2025 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..!

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాలు గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి వైదొలిగాడు. ఫెర్గూసన్ గాయంతో ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ప్రాథమిక జట్టులో స్థానం ద‌క్కింది.

ILT20లో దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో ఫెర్గూసన్ గాయపడ్డాడు. అతడు మ్యాచ్‌ వాకౌట్ చేసి ఫైనల్ నుండి నిష్క్రమించాడు. ఫెర్గూసన్‌కు ఇటీవల ముగిసిన ట్రై-సిరీస్‌కు కూడా న్యూజిలాండ్ జట్టులో స్థానం క‌ల్పించారు. కానీ అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.

ఫెర్గూసన్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి.. 17 పరుగులు ఇచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ నుండి లాకీ ఫెర్గూసన్‌ను మినహాయించడాన్ని ధృవీకరిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫెర్గూసన్ స్థానంలో ఆల్ రౌండర్ కైల్ జేమ్సన్‌ను జ‌ట్టులోకి తీసుకుంది.

కాలు గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి వైదొలిగాడు. కరాచీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఒక అనధికారిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫెర్గూసన్ కుడి కాలులో కొంత నొప్పిగా అనిపించింది. అతను మొత్తం టోర్నమెంట్‌లో పాల్గొనేంత ఫిట్‌గా లేడని ప్రాథమిక వైద్య రిపోర్టు సూచించింది. దీని దృష్ట్యా, ఫెర్గూసన్‌ను ఇంటికి పంపాలని నిర్ణయించాం అని న్యూజిలాండ్ క్రికెట్ వెల్ల‌డించింది.

Next Story