నీరజ్ చోప్రా 'జావెలిన్ త్రో'.. ఆ సమయంలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చేతుల్లో..!
‘Bhai give this javelin to me’, when Pakistan’s Arshad Nadeem did THIS to Neeraj Chopra before final. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
By Medi Samrat Published on 25 Aug 2021 10:48 AM GMT
టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను స్వర్ణం గెలిచిన రోజున, తన జావెలిన్ ఎక్కడ ఉందో గుర్తించలేకపోయానని.. దీంతో తాను కాస్త ఆందోళన చెందినట్లు కూడా వెల్లడించాడు. "తుది రౌండ్ ప్రారంభంలో నా జావెలిన్ కోసం వెతుకుతున్నా.. కానీ దానిని గుర్తించలేకపోయాను.. అకస్మాత్తుగా పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తన జావెలిన్ ను తీసుకుని తిరుగుతూ కనిపించాడు. ఆ జావెలిన్ తోనే పోటీకి దిగాలి.. తనకు తిరిగి ఇవ్వమని నదీమ్‌ని కోరాను. నదీమ్ దానిని తిరిగి ఇచ్చాడు.. దీని కారణంగా, మొదటి త్రోలో నేను తొందరపాటుతో కనిపించాను" అని చోప్రా చెప్పుకొచ్చాడు.
చోప్రా అర్షద్ నదీమ్‌ని సంప్రదించి తన జావెలిన్‌ను వెనక్కి తీసుకున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. నీరజ్ ఆ తర్వాత తన జావెలిన్‌ను దగ్గరగా పరిశీలించి త్రో కోసం వెళ్లాడు. త్రో తర్వాత అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే తాను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయానని నిరాశ చెందినట్లు కనిపించింది. గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినప్పటి నుంచీ నీరజ్ సన్మాన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. మెడల్ గెలవగానే ఇలా సెలెబ్రేషన్స్ లో మునిగిపోవడం కూడా సరైనది కాదని నీరజ్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల తర్వాత అందరూ సైలెంట్ అయిపోయి.. కనీసం పట్టించుకోరని అన్నాడు.