ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ నయం కదా..!

MS ధోని తన T20 కెరీర్‌లో మొదటిసారి 9వ స్థానంలో బ్యాటింగ్ చేసాడు. ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన IPL 2024 మ్యాచ్‌లో అతను గోల్డెన్ డక్‌తో ఔట్ కావడంతో అతని నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి

By Medi Samrat  Published on  6 May 2024 6:00 PM IST
ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ నయం కదా..!

MS ధోని తన T20 కెరీర్‌లో మొదటిసారి 9వ స్థానంలో బ్యాటింగ్ చేసాడు. ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన IPL 2024 మ్యాచ్‌లో అతను గోల్డెన్ డక్‌తో ఔట్ కావడంతో అతని నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ చెన్నై గెలిచింది కానీ.. ధోనీ మరీ అంత లేట్ గా రావడాన్ని మాత్రం మాజీ క్రికెటర్లు తప్పుబడుతూ ఉన్నారు. ధోనీ ఈ సీజన్‌లో CSK కోసం ఫినిషర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మ్యాచ్‌లలో 1-2 ఓవర్లు మిగిలి ఉండగా ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చాడు. PBKS మ్యాచ్ లో ధోని 19వ ఓవర్‌లో బ్యాటింగ్ కు రావడం కరెక్ట్ కాదని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లను తన కంటే ముందు బ్యాటింగ్ కు పంపించాడు.

ధోని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోని నిర్ణయం అసలు ఒప్పుకోనని అన్నాడు. ధోనీ నంబర్ 9లో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. CSK ధోని స్థానంలో మరొక పేసర్‌ను చేర్చుకోవాలని సూచించాడు. “ఎంఎస్ ధోని 9వ నంబర్ స్లాట్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటే మ్యాచ్ ఆడకూడదు. అతని కంటే ఫాస్ట్ బౌలర్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకోవడం మంచిది. శార్దూల్ ఠాకూర్ అతని కంటే ముందు వచ్చాడు. ఠాకూర్ ఎప్పుడూ ధోనీలా షాట్లు కొట్టలేడు, ధోనీ ఎందుకు ఈ తప్పు చేశాడో అర్థం కావడం లేదు. అతని అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఈరోజు CSK గెలిచినా, నేను ధోనీని ఈ విషయంలో మాత్రం తప్పుబడతాను." అని స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్ అన్నారు.

Next Story