మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్ అనంతరం వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. బెన్ స్టోక్స్ ఇటీవలే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బెన్ స్టోక్స్ 2019లో ఇంగ్లండ్ ప్రపంచకప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు సంవత్సరాల క్రితం లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో చివరి వరకూ పోరాడి ఇంగ్లాండ్‌కు తొలి వరల్డ్ కప్ అందించాడు.
అయితే మానసిక అలసట నుంచి కోలుకునేందుకు గతేడాది స్టోక్స్ కొంత సమయం విరామం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌లో టీంలో ముఖ్యమైన మ్యాచ్ విన్నర్‌లలో ఒకరైన బెన్ స్టోక్స్.. ఇప్పుడు టెస్ట్ క్రికెట్, టీ20లపై దృష్టి సారించాడు. ఇంగ్లండ్ తరఫున 104 వన్డేలు ఆడిన బెన్ స్టోక్స్.. భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. స్టోక్స్ 3 మ్యాచ్‌లలో కేవలం 48 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఎటువంటి వికెట్లు తీయలేదు.
సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక ప్రకటనలో స్టోక్స్.. మరొకరు తమ కెరీర్‌ను మలచుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. డర్హామ్‌లో మంగళవారం వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున నా చివరి మ్యాచ్ ఆడతాను. నేను ఈ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇంగ్లండ్‌లో నా సహచరులతో కలిసి ఆడే ప్రతి నిమిషం నాకు చాలా ఇష్టం. మేము అద్భుతమైన ప్రయాణం చేసామని పేర్కొన్నాడు.