కరోనా మళ్లీ కొంపముంచుతుందా..? ఈ సారి ఐపీఎల్ ఎక్కడంటే..?
BCCI Wants To Hold IPL In India But Overseas Venue Is Backup Option.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న
By తోట వంశీ కుమార్ Published on 9 Jan 2022 10:08 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న క్రేజే వేరు. ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రతి సంవత్సరం వేసవిలో ఈ టోర్ని జరుగుతుంది. ఈ సారి కూడా వేసవిలో నిర్వహించే ఐపీఎల్ 2022 సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకే బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఓ బీసీసీఐ ఉన్నతాధికారి జాతీయ మీడియాకు చెప్పారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో కరోనా కేసులు బారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ టోర్నీ జరిగే ఏప్రిల్, మే నెలలో కూడా కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరోసారి విదేశాల్లో టోర్నీ జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుతం బీసీసీఐ మెగా వేలం పై దృష్టాసారించినట్లు తెలుస్తోంది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. ఇప్పటికైతే ఇంకా ఎలాంటి వేదికలను ఖారారు చేయలేదని అన్నారు. టోర్నీ షెడ్యూల్ ప్రకటించకపోయినా ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరో వైపు కొత్తగా రెండు జట్లు రానుండడంతో ఆటగాళ్ల వేలం ఆలస్యం కానుంది. ఈ వేలాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇక కేసులు పెరిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా.. టోర్నీ జరిగే సమయానికి ఒకవేళ కేసులు పెరిగితే.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. తొలి ప్రాధాన్యం మాత్రం భారత్‌కే ఇస్తున్నట్టు తెలిపారు.