క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. 25 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి

BCCI to allow 25 percent capacity of crowd in stadiums as per COVID-19 protocols.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 9:35 AM GMT
క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. 25 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో కోల్‌క‌తా నైట్‌రైడర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త కొంత కాలంగా క్రికెట్ స్టేడియాల్లోకి ప్రేక్ష‌కుల‌ని అనుమ‌తించ‌క‌పోవ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈ సారి ఐపీఎల్‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి ఇస్తూ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్ణ‌యం తీసుకుంది.

క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ.. 25 శాతం ప్రేక్ష‌కుల‌తో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ విష‌యాన్ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. అభిమానులు తిరిగి క్రికెట్‌ను మైదానంలో నుంచి ఆస్వాదించేందుకు 15వ సీజ‌న్ సిద్ద‌మైంది. చాలా కాలంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాం అని బీసీసీఐ తెలిపింది. అభిమానులు అధికారిక వెబ్‌సైట్ www.iplt20.comలో టోర్నమెంట్ లీగ్ దశ కోసం మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చున‌ని చెప్పింది.

లీగ్ ద‌శ‌లో 70 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి కాకుండా మ‌రో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నుంది. ముంబైలోని వాంఖ‌డే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 చొప్పున, బ్రాబోర్నె, పుణెలోని ఎంఏసీ స్టేడియాల్లో 15 మ్యాచ్‌ల చొప్పున నిర్వ‌హించ‌నున్నారు. ఈ సారి రెండు కొత్త జ‌ట్లు రావ‌డంతో మొత్తం 10 జ‌ట్ల‌ను రెండు గ్రూప్‌లుగా విభ‌జించారు. ఒక్కో జ‌ట్టు లీగ్‌లో ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఆయా గ్రూప్‌ల‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తాయి.

Next Story