Video : అత్యుత్సాహంతో 'నోట్‌బుక్' సెలబ్రేషన్.. తిక్క కుదిర్చిన మ్యాచ్ రిఫరీ..!
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ 'నోట్‌బుక్' వేడుకను చేసుకోవడం అతనికి కష్టంగా మారింది.
By Medi Samrat
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ 'నోట్‌బుక్' వేడుకను చేసుకోవడం అతనికి కష్టంగా మారింది. మ్యాచ్ అనంతరం దిగ్వేష్‌కి బీసీసీఐ కఠిన శిక్ష విధించింది. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్య వికెట్ తీసిన తర్వాత దిగ్వేష్ సింగ్ 'నోట్‌బుక్' సెలబ్రేషన్ స్టైల్‌లో జరుపుకున్నాడు. దీంతో అతడు ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించి దోషిగా మిగిలాడు. పంజాబ్ కింగ్స్ లక్నోను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఆటగాడు దిగ్వేష్ రాఠీ బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్యను ఔట్ చేశాడు. ఆ సమయంలో అతడు తన వికెట్ తీసిన వెంటనే నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ‘నోట్‌బుక్’ స్టైల్‌లో డగౌట్‌కు వెళ్లమని సంకేతాలిచ్చాడు. దీంతో దిగ్వేష్ రాఠీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఈ జరిమానాతో పాటు రాఠీ ఖాతాలో 1 డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.
మ్యాచ్ రిఫరీ దిగ్వేష్ రాఠీని లెవల్ 1 దోషిగా నిర్ధారించారు. ఐపీఎల్ మీడియా అడ్వైజరీలో దిగ్వేష్ సింగ్ ఆర్టికల్ 2.5 కింద లెవల్ 1లో దోషిగా తేలిడాని రాశారు. ఒక ఆటగాడు లెవల్ 1లో దోషిగా తేలితే.. ఆ సందర్భంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయం మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. అంతిమంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై దిగ్వేష్ రాఠీ 2 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2025 13వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ 69 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులతో, నేహాల్ వధేరా 43 పరుగులతో అజేయంగా నిలిచారు.
DIGVESH RATHI DROPS AN ABSOLUTE BANGER CELEBRATION. 🤣❤️pic.twitter.com/kJWRa0xWtM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025