సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న య‌థాత‌థం.. టీ20లు వాయిదా

BCCI Secretary Jay Shah Confirms India Will Tour South Africa.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ద‌క్షిణాఫ్రికాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2021 12:59 PM IST
సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న య‌థాత‌థం.. టీ20లు వాయిదా

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ద‌క్షిణాఫ్రికాలో గుర్తించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అక్క‌డ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా సౌతాఫ్రికా టూర్ పై సందిగ్థ‌త నెల‌కొంది. ఈ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డుతుంద‌ని ప‌లు వార్త‌లు వినిపించాయి. ఎట్ట‌కేల‌కు ఈ వార్త‌ల‌పై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్ప‌ష్ట‌త నిచ్చింది. భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. షెడ్యూల్ ప్ర‌కార‌మే మ్యాచ్‌లు జ‌రుగుతాయ‌ని చెప్పింది.

అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా టెస్టులు, వ‌న్డే మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడుతుంద‌ని.. టీ 20 ల‌పై త‌రువాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా శ‌నివారం తెలిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారం టీమ్ఇండియా మూడు టెస్టులు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. నాలుగు టీ20ల‌ను త‌రువాత షెడ్యూల్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మ్యాచ్‌లకు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించేది లేనిది ఇంకా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్ల‌డించ‌లేదు.

ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక‌వేళ భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్ల‌యితే.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు భారీ న‌ష్టం వాటిల్లిలే అవ‌కాశం ఉంది. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయిన నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు కివీస్‌తో రెండో టెస్టు ముగిసిన అనంత‌రం వెంట‌నే విమానం ఎక్క‌నుంది.

Next Story