టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ నుంచి మరొకరు అవుట్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగబోతున్న ఆసియా కప్ ఈవెంట్‌ ముందు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ నుంచి మరొకరిని తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat
Published on : 23 Aug 2025 5:29 PM IST

టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ నుంచి మరొకరు అవుట్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగబోతున్న ఆసియా కప్ ఈవెంట్‌ ముందు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ నుంచి మరొకరిని తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు గత 15 ఏళ్లుగా జట్టుతో ఉన్న టీమ్ మసాజర్ రాజీవ్ కుమార్‌ ను ఆ పదవి నుంచి తప్పించారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసిన సమయంలోనూ రాజీవ్ కుమార్ సపోర్ట్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నారు. కాంట్రాక్ట్ ముగియడంతో ఆయన స్థానంలో మరో మసాజర్‌ను సపోర్ట్ స్టాఫ్‌లోకి తీసుకున్నారు.

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న నాటి నుంచి బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఇటీవలే బీసీసీఐ మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లకు కూడా కాంట్రాక్ట్‌లు దక్కలేదు.

Next Story