మహ్మద్ షమీ కెరీర్ ముగిసిన‌ట్లేనా.? ఈ జ‌ట్టు ఎంపిక వెన‌క ఎన్నో కార‌ణాలు..!

న్యూజిలాండ్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో చాలా మార్పులు కనిపించాయి. వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత జ‌ట్టులోకి తిరిగి వస్తున్నారు.

By -  Medi Samrat
Published on : 3 Jan 2026 9:43 PM IST

మహ్మద్ షమీ కెరీర్ ముగిసిన‌ట్లేనా.? ఈ జ‌ట్టు ఎంపిక వెన‌క ఎన్నో కార‌ణాలు..!

న్యూజిలాండ్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో చాలా మార్పులు కనిపించాయి. వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత జ‌ట్టులోకి తిరిగి వస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గిల్ గాయపడగా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు.

జట్టు ప్రకటనతో పాటు, BCCI COE నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందడంపై శ్రేయాస్ అయ్యర్ లభ్యత ఆధారపడి ఉంటుందని BCCI స్పష్టం చేసింది. మహ్మద్ షమీకి మరోసారి భారత జట్టులో చోటు దక్కలేదు. భారత వన్డే జట్టుకు సంబంధించిన పెద్ద విషయాలను తెలుసుకుందాం.

15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. బీసీసీఐ విడుదల చేసిన విడుదల ప్రకారం.. ఒక మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి హార్దిక్ పాండ్యాను బీసీసీఐ సీఈఓ అనుమతించలేదు.

ఇది మాత్రమే కాదు.. ICC పురుషుల T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అతనిపై పనిభారం ప‌డ‌కుండా విశ్రాంతి నిచ్చారు. పనిభారం కారణంగా బుమ్రాను కూడా వన్డేలకు దూరంగా ఉంచారు. T20 ప్రపంచ కప్ 2026కు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం ముఖ్యం.

ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో జార్ఖండ్ చరిత్ర సృష్టించి తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది. టోర్నీలో ఇషాన్ బ్యాట్‌తో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతడిని T20 ప్రపంచ కప్ 2026కు జ‌ట్టులో చోటు సంపాదించాడు. కానీ వన్డే జట్టులో ఇషాన్‌కు చోటు దక్కలేదు. ప్ర‌స్తుత‌ జట్టులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రూపంలో రెండు వికెట్ కీపింగ్ ఆప్ష‌న్స్‌ ఉన్నాయి. అందుకే ఇషాన్ కిషన్‌ను జ‌ట్టులోకి ఎంపిక చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 మ్యాచ్‌లలో 2 ఇన్నింగ్స్‌ల్లో 113 పరుగులు చేశాడు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో మాత్రం సెంచరీ సాధించాడు. ప్ర‌స్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అతడు 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దీని తర్వాత కూడా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అతనికి చోటు దక్కలేదు.

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. ODI ప్రపంచ కప్ 2027ని దృష్టిలో ఉంచుకుని అతడికి ODI ఫార్మాట్‌లో అవకాశాలను క‌ల్పించ‌నున్నారు. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడి కెరీర్ ముగిసిపోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అతనికి అవకాశం రాలేదు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కూడా చోటు ద‌క్క‌లేదు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో కూడా స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు.

వన్డే సిరీస్ కోసం భారత జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

Next Story