ఐపీఎల్ లో 10 జట్లు ఎప్పటి నుండి రాబోతున్నాయంటే..!

BCCI Clears 10-Team IPL From 2022. ఐపీఎల్ ప్రస్తుతం 8 జట్లతో నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఐపీఎల్ లో జట్ల సంఖ్య

By Medi Samrat  Published on  24 Dec 2020 7:30 PM IST
ఐపీఎల్ లో 10 జట్లు ఎప్పటి నుండి రాబోతున్నాయంటే..!

ఐపీఎల్ ప్రస్తుతం 8 జట్లతో నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఐపీఎల్ లో జట్ల సంఖ్య పెంచాలని.. 10 మందితో నిర్వహించాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. ఒకప్పుడు అలా నిర్వహించినా..ఆ తర్వాత కొన్ని కారణాల వలన 8 జట్లతోనే నిర్వహించాల్సి వస్తోంది. కరోనా సమయంలో కూడా బీసీసీఐ ఐపీఎల్ ను అద్భుతంగా నిర్వహించింది. 2021 లో ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇక 8 జట్లకు బదులుగా 10 జట్లు ఉంటాయనే ప్రచారం నడిచింది.

కానీ ఐపీఎల్-2021 కి సమయం చాలా తక్కువగా ఉండడంతో 10 జట్ల ఐడియాను బీసీసీఐ వెనక్కు తీసుకుంది. 2022 లో ఐపీఎల్ ను 10 జట్లతో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ లో 2022 సీజన్ నుంచి 10 జట్లు క్రికెట్ వినోదాన్ని అందించనున్నాయి. రెండు కొత్త జట్ల ప్రవేశానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించారు. 2021 సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ జరపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా, సమయం లేదని అన్నారు. రెండు కొత్త జట్లకు బిడ్డింగ్ లు పిలవాల్సి ఉండడంతో నూతన ఫ్రాంచైజీలను హడావిడిగా నిర్ణయించలేమని బోర్డు యాజమాన్యం పేర్కొంది. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయంగా మద్దతు పలకాలని నేటి సమావేశంలో నిర్ణయించారు.


Next Story