ఒమిక్రాన్‌ వేళ‌ బీసీసీఐకి షాక్‌ : చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా

BCCI chief medical officer Abhijit Salvi resigns due to personal reasons. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి వ్యక్తిగత

By Medi Samrat  Published on  18 Dec 2021 6:43 PM IST
ఒమిక్రాన్‌ వేళ‌ బీసీసీఐకి షాక్‌ : చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి వ్యక్తిగత కారణాలతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. తన నోటీసు ఫీరియ‌డ్‌ నవంబర్ 30తో ముగిసిందని.. అయితే డిసెంబర్ 7న భారత్-న్యూజిలాండ్ మధ్య జ‌రిగిన‌ రెండో టెస్టు ముగిసే వరకు త‌న సేవ‌లు కొనసాగించానని సాల్వీ చెప్పాడు. రెగ్యులర్ టెస్టింగ్, బబుల్ లైఫ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అంతర్భాగంగా మారిన నేఫ‌థ్యంలో కోవిడ్ కాలంలో అతని సేవ‌లు ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయి. బీసీసీఐతో జర్నీ 10 సంవత్సరాలుగా అద్భుతంగా సాగింద‌ని.. కానీ నేను విభిన్నంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని సాల్వి అన్నారు.

క‌రోనా మహమ్మారి స‌మ‌యంలో పనిచేయడం సవాలుగా మారింద‌ని.. దాదాపు అన్ని టోర్నమెంట్లను కొన‌సాగించాం. దేశవాళీ కూడా బాగా సాగుతుంది. దీని ప‌ట్ల‌ సంతోషంగా ఉన్నానని సాల్వి అన్నారు. సీసీఐ ఏజ్ వెరిఫికేష‌న్‌, యాంటీ డోపింగ్ మరియు మెడికల్ విభాగానికి అభిజిత్ సాల్వి బాధ్యత వహించారు. వచ్చే నెలలో విజయ్ మర్చంట్ ట్రోఫీకి ముందు సాల్వి రాజీనామా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా, శ్రీలంక సహా కొన్ని పర్యటనల్లో సాల్వీ భారత జట్టుతో కలిసి ప్రయాణించాడు. సాల్వి UAEలో జ‌రిగిన‌ IPL, T20 ప్రపంచ కప్ రెండు ఎడిషన్ల వైద్య సంబంధ‌మైన‌ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాడు.


Next Story