ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. ఏ రోజు ఏ మ్యాచ్ అంటే..?

BCCI announces schedule for vivo ipl 2021.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2021 సీజ‌న్ షెడ్యూల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 9:32 AM GMT
BCCI announces schedule for vivo IPL 2021

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2021 సీజ‌న్ షెడ్యూన్‌ను ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుద‌ల చేసింది. ఏప్రిల్ 9 నుంచి 14వ సీజ‌న్ ప్రారంభం కానుంది. దేశంలోని ఆరు వేదిక‌ల్లో టోర్నీ జ‌ర‌గ‌నుంది. అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా ల‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే మంత్రి కేటీఆర్, విజ్ఞ‌ప్తి చేసినా.. హైద‌రాబాద్‌కు మాత్రం బీసీసీఐ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఏప్రిల్ 9న చెన్నై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య తొలి పోరు జ‌ర‌గ‌నుంది. మే 30న మొతెరా(న‌రేంద్ర మోడీ) స్టేడియంలో ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. అలాగే ఫ్లే ఆప్స్ కూడా మొతెరా స్టేడియంలోనే నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌తి టీమ్ నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు ఆడ‌నుంది. మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. చెన్నై, ముంబై, కోల్‌క‌తా, బెంగ‌ళూరు త‌లా 10 మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మివ్వ‌నుండ‌గా, అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ చెరో 8 మ్యాచ్‌ల‌కు ఆతిథ్య‌మివ్వ‌నున్నాయి. ఈ సీజ‌న్ ప్ర‌త్యేకత ఏంటంటే అన్ని టీమ్స్ త‌ట‌స్థ వేదిక‌ల్లోనే మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఏ టీమ్ కూడా హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడ‌బోవ‌డం లేదు. గ‌తేడాది క‌రోనా కార‌ణం సుమారు ఆరు నెల‌ల వాయిదా ప‌డిన ఐపీఎల్ 13వ సీజ‌న్ చివ‌రికి సెప్టెంబ‌ర్‌లో యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దేశంలో సాధార‌ణ ప‌రిస్థితులు రావ‌డం, స్టేడియాల‌కు అభిమానుల‌ను కూడా 50శాతం అనుమ‌తిస్తుండ‌డంతో బీసీసీఐ ఈ సారి ఇక్క‌డే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ‌ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి



Next Story