ఇంగ్లాండ్‌తో టి20, వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే
BCCI announces India’s squads for ODI and T20I series against England.భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో
By తోట వంశీ కుమార్ Published on 1 July 2022 10:48 AM ISTభారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టీమ్ఇండియా ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. టెస్టు మ్యాచ్ నేడు ఆరంభం కానుండగా.. జులై 7 నుంచి టీ20 సిరీస్, జులై 12 నుంచి వన్డే సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరీస్‌లలో ఇంగ్లాండ్‌తో తలపడే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే.. టెస్టు మ్యాచ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు తొలి టీ20లో విశాంత్రి నిచ్చారు.
ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి సెలక్టర్లు ఎంపిక చేశారు. కరోనా కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. యువ పేసర్ ఆర్షదీప్ సింగ్ వన్డే జట్టులో తొలిసారి చోటు దక్కింది. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం కావడంతో సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు అవకాశం లభించింది.
తొలి టి20కి భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
రెండు,మూడు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్ సింగ్
NEWS 🚨 - #TeamIndia's squad for T20I & ODI series against England announced.
— BCCI (@BCCI) June 30, 2022
More details 👇 #ENGvIND https://t.co/ii121ge0jY