బంగ్లాదేశ్ కు ఊహించని షాకిచ్చిన జింబాబ్వే

ఒకప్పుడు సంచలన విజయాలతో క్రికెట్ ప్రపంచంలో రాణించిన జింబాబ్వే జట్టు ఆ తర్వాత పలు కారణాలు, రాజకీయాల కారణంగా దాదాపుగా కనుమరుగైంది.

By Medi Samrat
Published on : 23 April 2025 3:21 PM

బంగ్లాదేశ్ కు ఊహించని షాకిచ్చిన జింబాబ్వే

ఒకప్పుడు సంచలన విజయాలతో క్రికెట్ ప్రపంచంలో రాణించిన జింబాబ్వే జట్టు ఆ తర్వాత పలు కారణాలు, రాజకీయాల కారణంగా దాదాపుగా కనుమరుగైంది. అడపాదడపా జింబాబ్వే విజయాలు సాధిస్తూ కొన్ని జట్లను ఆశ్చర్య పరుస్తూ ఉంది. తాజాగా బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏప్రిల్ 23న బంగ్లాదేశ్‌ తో జరుగుతున్న సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ విజయంతో జింబాబ్వే చరిత్ర సృష్టించింది. ఏడు సంవత్సరాల తర్వాత విదేశీ గడ్డపై జింబాబ్వే టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.

క్రెయిగ్ ఎర్విన్ నేతృత్వంలోని జట్టు బుధవారం నాడు ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో విజయాన్ని పూర్తి చేసింది. వారి చివరి విదేశీ టెస్ట్ విజయం 2018లో బంగ్లాదేశ్‌పై జరిగింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా బాగానే పోరాడింది. 255 పరుగులు చేసింది. ఇక లక్ష్యాన్ని చేరుకోడానికి జింబాబ్వే బాగా శ్రమించింది. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

Next Story