మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 22 Nov 2025 4:13 PM IST

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రానున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ కూడా నటించబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుందని, ఈ చిత్రంలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని స్పష్టం చేశారు. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఆదిత్య 369’. దాదాపు 35 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

Next Story