గప్టిల్‌ను దాటేసిన బాబ‌ర్‌.. ఇక‌ కోహ్లీ, రోహిత్ మాత్ర‌మే ముందున్నారు..!

బాబర్ ఆజం టీ20 ఫార్మాట్‌లో మెరుస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు

By Medi Samrat  Published on  12 Jan 2024 2:45 PM GMT
గప్టిల్‌ను దాటేసిన బాబ‌ర్‌.. ఇక‌ కోహ్లీ, రోహిత్ మాత్ర‌మే ముందున్నారు..!

బాబర్ ఆజం టీ20 ఫార్మాట్‌లో మెరుస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. త‌ద్వారా న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను రికార్డును అధిగ‌మించాడు. 122 టీ20 మ్యాచ్‌ల్లో గప్టిల్ 31.81 సగటుతో 3,531 పరుగులు చేశాడు. అయితే.. ఈరోజు ఆక్లాండ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో బాబర్ గప్టిల్‌ను వెనక్కి నెట్టాడు. న్యూజిలాండ్‌పై మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన బాబర్ 57 పరుగులు చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో బాబర్‌ పరుగుల సంఖ్య 3,542కి చేరింది.

ప్ర‌స్తుతం అతని కంటే భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే ముందున్నారు. టీ20 ఫార్మాట్‌లో 115 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 52.73 సగటుతో 4,008 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 149 మ్యాచ్‌ల్లో 141 ఇన్నింగ్స్‌లలో 31.07 సగటుతో 3,853 పరుగులు చేశాడు.

బాబర్ అజామ్ T20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 105 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 99 ఇన్నింగ్స్‌లలో 41.67 సగటుతో 3,542 పరుగులు చేశాడు. T20 ఫార్మాట్‌లో అతని పేరు మీద మూడు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బాబ‌ర్ ఆజామ్ ఎక్కువ కాలం క్రికెట్‌లో కొన‌సాగే అవ‌కాశం ఉండ‌టంతో రోహిత్‌, కోహ్లీల రికార్డులు అత‌డు బ‌ద్ధ‌లుకొట్టే అవ‌కాశం ఉందని అంటున్నారు క్రీడా విశ్లేష‌కులు.

Next Story