పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అలాంటి వాడా..?

Babar Azam exploited me for 10 years, sexually abused me. ఏదో ఒక వివాదం పాకిస్థాన్ క్రికెట్ జట్టును వెంటాడుతూనే ఉంటుంది

By Medi Samrat  Published on  29 Nov 2020 2:23 PM IST
పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అలాంటి వాడా..?

ఏదో ఒక వివాదం పాకిస్థాన్ క్రికెట్ జట్టును వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజమ్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది.‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తనతో ప్రేమలో ఉన్నప్పుడు బాబర్ ఆజమ్ కు క్రికెటర్ గా కూడా గుర్తింపు లేదని సదరు మహిళ మీడియాకు చెప్పుకొచ్చింది.

10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనను పలు చోట్ల ఉంచాడని అడ్రెస్ లతో సహా మీడియాకు సమాచారాన్ని ఇచ్చింది. బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది. బాబర్, తాను స్కూల్ దశలోనే స్నేహితులమని.. 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మా ఇంట్లోనే బాబర్ నాకు ప్రపోజ్ చేశాడని యువతి వెల్లడించింది. అతడి ప్రేమకు ఓకే చెప్పిన తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని యువతి వెల్లడించింది.

ప్రేమలో ఉన్న సమయంలో శారీరకంగా కూడా దగ్గరయ్యామని తెలిపింది. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడని వెల్లడించింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చంపుతానని తనను బాబర్ బెదిరించాడని ఆమె ఆరోపణలు గుప్పించింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా బాబర్ ఆజమ్ కు సపోర్ట్ గా నిలిచిందని.. తాను మీడియా ముందుకు వచ్చి గోడును చెప్పుకోవడం తప్ప చేసేది ఏమీ లేకుండా పోయిందని వాపోయింది. ప్రస్తుతం బాబర్ ఆజమ్ న్యూజిలాండ్ సిరీస్ పర్యటనలో ఉన్నాడు. ఈ ఆరోపణలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కుదిపేస్తూ ఉన్నాయి. బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు.


Next Story