అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రేను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 3 విజేత ఉండనున్నాయి. గ్రూప్-‘బి’ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, క్వాలిఫయర్-2 విజేత బరిలోకి దిగనుంది. డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అండర్-19 ఆసియా కప్ టోర్నీ జరగనుంది.