IND vs SA : తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో రోజు కూడా మనదే..!
దక్షిణాఫ్రికాతో రుగుతున్న తొలి టెస్టులో భారత్ తన పట్టును పటిష్టం చేసుకుంది.
By - Medi Samrat |
దక్షిణాఫ్రికాతో రుగుతున్న తొలి టెస్టులో భారత్ తన పట్టును పటిష్టం చేసుకుంది. రెండో ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా బ్యట్స్‌మెన్ విఫలమవగా.. కెప్టెన్ టెంబా బావుమా ఒక్కడే ఇప్పటికీ క్రీజులో ఉన్నాడు.. అయితే.. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రెండో రోజు మొత్తం 15 వికెట్లు పడిపోయాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌తో దక్షిణాఫ్రికా పోటీపడాలంటే.. మంచి భాగస్వామ్యం అవసరం. అయితే రేపే ఫలితం వస్తుందని అంతా భావిస్తున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో ఈ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. బావుమ 29 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. కార్విన్ బాష్ 1 పరుగు చేసి అతనితో ఉన్నాడు. దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 30 పరుగుల ఆధిక్యం ఉంది.
రెండో రోజు ఆట తొలి సెషన్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో సెషన్‌లో భారత్ అన్ని వికెట్లు కోల్పోయింది. గిల్ మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. భారత్ 9 వికెట్లకు 189 పరుగులు చేసి 30 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
భారత్ ఒక వికెట్ నష్టానికి 31 పరుగులతో రోజు ఆట ప్రారంభించింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్.. కేఎల్ రాహుల్‌కు మంచి సహకారం అందించి స్కోరును 75 పరుగులకు చేర్చాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ బంతికి సుందర్ ఔటయ్యాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షాట్ ఆడుతున్నప్పుడు మెడ స్ట్రెయిన్‌కు గురయ్యాడు, ఆ తర్వాత అతను వెనుదిరిగాడు. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ను కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. 119 బంతుల్లో 39 పరుగులు చేశాడు. రాహుల్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 27-27 పరుగులు చేసినా వారి ఇన్నింగ్స్‌ను పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయారు. ధ్రువ్ జురెల్ 14 పరుగులు, అక్షర్ పటేల్ 16 పరుగులు మాత్రమే చేయగలిగారు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా తలా ఒక్క పరుగు మాత్రమే చేయగలిగారు. దక్షిణాఫ్రికా తరఫున హార్మర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు తీశాడు. మహరాజ్, బాష్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. దక్షిణాఫ్రికాపై భారత్ 30 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఆ తర్వాత భారత స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. తొలుత ర్యాన్ రికెల్టన్(11) కుల్దీప్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఐడెన్ మార్క్రమ్‌ను రవీంద్ర జడేజా నాలుగు పరుగుల వద్ద అవుట్ చేశాడు. వియాన్ ముల్డర్(11) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత టోనీ డి జార్జి (2), ట్రిస్టన్ స్టబ్స్ (5)లను జడేజా పెవిలియన్ పంపాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుండగా కైల్ వారెన్ బౌల్డ్ అయ్యాడు. యాన్సెన్‌ను కుల్దీప్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఇప్పటి వరకు భారత్ తరఫున జడేజా నాలుగు వికెట్లు, కుల్దీప్ రెండు, పటేల్ ఒక వికెట్ తీశారు.