షేన్ వార్న్‌ పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే..?

Autopsy report reveals Shane Warne's reason for death.స్పిన్‌ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 1:18 PM GMT
షేన్ వార్న్‌ పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే..?

స్పిన్‌ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం క‌ల‌చివేస్తోంది. శుక్ర‌వారం థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీప‌మైన కోహ్ స‌మూయిలోని త‌న రిసార్ట్‌లో అచేత‌నంగా ప‌డి ఉన్న వార్న్‌ను అత‌డి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న్ను బ‌తికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే.

ఆదివారం వార్న్ భౌతిక‌కాయానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా.. నేడు ఆ రిపోర్టు వ‌చ్చింది. వార్న్ ది స‌హ‌జ మ‌ర‌ణ‌మేన‌ని వైద్యులు నిర్థారించిన‌ట్లు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. వార్న్ చిన్న‌త‌నం నుంచి ఉన్న వ్యాధి కార‌ణంగానే(కాంజెషిన‌ల్ డిసీజ్) మ‌ర‌ణించినట్లు పోస్టుమార్టం చెప్తోంది. వార్న్ పోస్టుమార్టం రిపోర్టును వార్న్ కుటుంబ స‌భ్యులు, ఆస్ట్రేలియా రాయ‌బార కార్యాల‌యానికి పంపిన‌ట్లు థాయ్‌లాండ్ పోలీసుల ప్ర‌తినిధి కిస్సానా ప‌థ‌నాచెరోనో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ రిపోర్టును వార్న్ కుటుంబ స‌భ్యులు కూడా అంగీక‌రించార‌ని స‌మాచారం.

మరోవైపు.. మరణానికి ముందు 14 రోజులుగా కేవలం ద్రవ రూపంలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే వార్న్ తీసుకున్నాడని, ఈ డైట్ వార్న్ కొంపముంచిందని వార్న్ మేనేజర్ జేమ్స్‌ ఎర్స్‌కిన్ అంటున్నాడు. ఇక వార్న్ భౌతిక కాయాన్ని మంగ‌ళ‌వారం థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు త‌ర‌లించ‌నున్నారు. వార్న్ అంత్య‌క్రియ‌ల‌ను ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హిస్తామ‌ని ఇప్ప‌టికే ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Next Story