పాకిస్థాన్ సూపర్ లీగ్ జరిగేనా.. ఆ ఆటగాళ్లు డౌట్..!

మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఆటగాళ్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది.

By -  Medi Samrat
Published on : 17 March 2026 7:00 PM IST

పాకిస్థాన్ సూపర్ లీగ్ జరిగేనా.. ఆ ఆటగాళ్లు డౌట్..!

మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఆటగాళ్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడ్డారు. పీఎస్‌ఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సహా చాలా మంది ఆసీస్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. ఇంకా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. ఆసీస్‌ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది. పాక్‌-ఆఫ్గన్‌ యుద్ధం కారణంగా పెషావర్‌ ప్రస్తుతం ‘నో ట్రావెల్‌ జోన్‌’లో ఉంది.

మార్చి 28న పెషావర్‌ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్‌కు పెషావర్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. పెషావర్‌ జాల్మీ జట్టులోనే ఆరోన్‌ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్‌ ప్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుకు హామీ ఇచ్చారు.

Next Story