ఆస్ట్రేలియా ఓపెన్ ను సొంతం చేసుకున్న ఒసాకా

Australian Open 2021 Women's Final Osaka Beats Brady. సెమీ ఫైనల్ లో సెరెనా విలియమ్స్ ను చిత్తు చేసిన జపనీస్‌ టెన్సీస్‌ స్టార్‌

By Medi Samrat  Published on  20 Feb 2021 4:56 PM IST
ఆస్ట్రేలియా ఓపెన్ ను సొంతం చేసుకున్న ఒసాకా

సెమీ ఫైనల్ లో సెరెనా విలియమ్స్ ను చిత్తు చేసిన జపనీస్‌ టెన్సీస్‌ స్టార్‌ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్‌ బార్డీ(22వ సీడ్‌)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించేసింది. మ్యాచ్ ముందు నుండి ఒసాకాను ఫేవరెట్ గా భావించారు. ఫైనల్ లో బార్డీ అద్భుతం ఏమైనా సృష్టిస్తుందేమోనని ఆశించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. మ్యాచ్ ఆరంభం నుండే ఒసాకా బార్డీ మీద విరుచుకుపడింది. అద్భుతమైన సర్వ్ లతో.. నెట్ వద్ద చురుగ్గా కదిలిన ఒసాకా మ్యాచ్ ను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఒసాకా కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలుచుకుంది. కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా.. అందులో రెండు యూఎస్‌ ఓపెన్‌(2018, 2020)టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌(2019,2021) టైటిల్స్‌ ఉన్నాయి.


Next Story