మరోసారి టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇదే.!

అడిలైడ్ వన్డే మ్యాచ్ లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

By -  Medi Samrat
Published on : 23 Oct 2025 8:52 AM IST

మరోసారి టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇదే.!

అడిలైడ్ వన్డే మ్యాచ్ లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఎటువంటి మార్పులు లేకుండా మ్యాచ్ లో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మూడు మార్పులు చేసింది. కారీ, బార్ట్‌లెట్, జంపా ఆసీస్ జట్టులో చేరారు. ఫిలిప్, ఎల్లిస్, కుహ్నెమాన్ కు రెస్ట్ ఇచ్చింది.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ , కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Next Story