క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు

భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 5:46 PM IST

క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు

భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19) మంచి ఆరంభాన్నిచ్చాడు. అయితే నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో స్లో బంతికి ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి వేగంగా పరుగులు చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల వద్ద ఉండగా, స్కోరు 97/1 వద్ద వర్షం మొదలైంది. ఆ సమయంలో గిల్ (20 బంతుల్లో 37*), సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39*) క్రీజులో ఉన్నారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటను కొనసాగించే పరిస్థితి లేదని నిర్ధారించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

Next Story