ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ భారీ స్కోర్ నమోదు చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2025 7:15 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ భారీ సెంచరీ బాదాడు. డకెట్ మొత్తం 143 బంతులు ఎదుర్కొని 165 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 17 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. డకెట్ సెంచరీ సాయంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఇంగ్లండ్ మిడిలార్డర్ లో జో రూట్ (68), కెప్టెన్ జోస్ బట్లర్ (23) పరుగులు చేశారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ 10 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షూయిస్ 3, ఆడమ్ జంపా 2, లబుషేన్ 2, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు. గ్రూప్- బిలో భాగంగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ లో తేలిపోయిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.
Next Story