హ‌ర్థిక్‌-జ‌డేజా జోరు.. భారీ స్కోర్ సాధించిన టీమ్ ఇండియా

Australia Target 302 In 3rd Odi. కాన్‌బెర్రా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో టీమ్ఇండియా భారీస్కోర్

By Medi Samrat  Published on  2 Dec 2020 8:26 AM GMT
హ‌ర్థిక్‌-జ‌డేజా జోరు.. భారీ స్కోర్ సాధించిన టీమ్ ఇండియా

కాన్‌బెర్రా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో టీమ్ఇండియా భారీస్కోర్ సాధించింది. ఆల్‌రౌండ‌ర్లు హార్థిక్ పాండ్యా (92; 76బంతుల్లో 7పోర్లు 1సిక్స్‌), ర‌వీంద్ర జ‌డేజా ( 66; 50 బంతుల్లో 5 పోర్లు, 3సిక్స‌ర్లు)లు రాణించ‌డంతో.. నిర్ణీత 50 ఓవ‌ర్లలో టీమ్ఇండియా ఐదు వికెట్ల న‌ష్టానికి 302 ప‌రుగులు చేసింది.

టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. 26 ప‌రుగుల వద్ద భార‌త్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 16 ప‌రుగులు చేసిన శిఖ‌ర్ ధావ‌న్.. అబాట్ బౌలింగ్‌లో పేల‌వ షాట్‌తో పెవిలియ‌న్ చేరాడు. ఈ ద‌శ‌లో బ్యాటింగ్ వ‌చ్చిన కోహ్లీ ( 63; 78 బంతుల్లో 5పోర్లు) మ‌రో ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌( 33; 39 బంతుల్లో 3పోర్లు, 1సిక్స్‌)తో క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద‌ద్దాడు. గిల్‌ను అగ‌ర్ ఔట్ చేయ‌డంతో 56 ప‌రుగుల రెండో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

ఈ ద‌శ‌లో ఆసీస్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌గా.. శ్రేయాస్ (19), రాహుల్‌ (5) లు వెంట వెంట‌నే పెవిలియ‌న్‌కు చేరారు. అడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు బాదిన కోహ్లీ 62 బంతుల్లో అర్థ‌శ‌త‌కం సాధించాడు. కోహ్లీని హెజిల్‌వుడ్ ఔట్ చేయ‌డంతో.. 152 ప‌రుగుల‌కే భార‌త్ స‌గం వికెట్ల‌ను చేజార్చుకుంది. ఈ ద‌శ‌లో ఆల్‌రౌండ‌ర్లు హార్థిక్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజాలు జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రూ ఆరో వికెట్‌కు అభేద్యంగా 150 ప‌రుగులు జోడించారు. తొలుత హార్థిక్ దాటిగా ఆడ‌గా.. ఇన్నింగ్స్ చివ‌ర్లో జ‌డేజా పెను విధ్వంసం సృష్టించడంతో.. భార‌త్ మూడు వంద‌ల ప‌రుగు‌లు దాటింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అగర్ రెండు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్, అబాట్‌, జంపా త‌లా ఓ వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు.


Next Story