Australia Spinner Nathan Lyon Gets Married To Emma McCarthy. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన స్నేహితురాలు ఎమ్మా మెక్‌కార్తీని
By Medi Samrat Published on 25 July 2022 1:18 PM GMT
ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన స్నేహితురాలు ఎమ్మా మెక్‌కార్తీని ఆదివారం వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత, లియోన్ తన భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పలువురు క్రికెటర్లు, అభిమానులు లియాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో లియాన్ చివరిసారిగా కనిపించాడు. లియాన్ తన భార్య ఎమ్మాతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అతను పోస్ట్‌కు "మిస్టర్ అండ్ మిసెస్" అని క్యాప్షన్ ఇచ్చాడు.
శ్రీలంకతో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో, లియోన్ మొదటి టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా.. మొత్తం 11 వికెట్లు తీశాడు. తొలి టెస్టులో మొత్తం తొమ్మిది వికెట్లను తీశాడు. లియాన్ 110 మ్యాచ్‌ల్లో 438 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది డిసెంబర్‌లో లియోన్ సుదీర్ఘమైన ఫార్మాట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. యాషెస్ సిరీస్ లోనే అతను ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకూ లియాన్ 20 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. లియాన్ ఆస్ట్రేలియా తరపున 29 ODIలు ఆడాడు, 29 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/44 గా ఉన్నాయి. ఆఫ్ స్పిన్నర్ ఆస్ట్రేలియా తరపున రెండు T20Iలు కూడా ఆడాడు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతను చివరిసారిగా 2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో టీ20 ఆడాడు.