ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు ఆధిక్యాన్ని అందుకున్న ఆసీస్.. రెండో రోజు ముగిసే సమయానికి కేవలం ఒక్క వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఖవాజా 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ట్రేవిస్ హెడ్ 40 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లబుషేన్ 16 పరుగులతో ఆడుతూ ఉన్నాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 263 పరుగులకు బదులుగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత పోరాటం కారణంగా భారత్ ఈ మ్యాచ్ లో పుంజుకోగలిగింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్, అశ్విన్ ఆసీస్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొని జట్టు స్కోరును 250 దాటించారు. అక్షర్ 115 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. అశ్విన్ 71 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఆసీస్ బౌలర్లలో లైయన్ 5, కుహ్నెమన్ 2, టాడ్ మర్ఫీ 2, కమిన్స్ 1 వికెట్ తీశారు.