చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ముందు ఆస్ట్రేలియా మంచి లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు క్రమంగా వికెట్ల తీసినప్పటికీ.. ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ 47 టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలెక్స్ క్యారీ 38, హెడ్ 33 పరుగులతో రాణించారు.
ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడడంతో తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 68 పరుగుల వద్ద హెడ్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి హెడ్ అవుట్ అయ్యాడు. అనంతరం స్మిత్, మిచెల్ మార్ష్ ను స్వల్ప వ్యవధిలోనే పాండ్యా వెనక్కు పంపాడు. తర్వాత వార్నర్, లబూషేన్ జోడి, క్యారీ, స్టోయినిస్ క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ ను నడిపించే ప్రయత్నం చేశారు. కుల్దీప్, అక్షర్ వారిని అవుట్ చేశారు. చివర్లో సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. భారత్ బౌలింగ్‌లో హార్దిక్ 3, కుల్దీప్ 3, అక్షర్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. డేవిడ్ వార్నర్ (23), లబుషేన్ (28), అలెక్స్ క్యారీ (38), అబాట్ (26), స్టోయినిస్ (25) పర్వాలేదనిపించారు.