ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ఎదుట 444 పరుగుల విజయ లక్ష్యం ఉంది. 270 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఐదు బంతుల్లో ఐదు పరుగులు చేసి కెప్టెన్ పాట్ కమిన్స్ ఔటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ఆస్ట్రేలియా తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మరో ఎండ్‌లో అలెక్స్ కారీ 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ ముందు 444 పరుగుల లక్ష్యం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. షమీ, ఉమేష్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.