తొలి వన్డేలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం

ఆస్ట్రేలియా జ‌రిగిన తొలి వన్డేలో టీమిండియా ఓట‌మి పాల‌య్యింది.

By -  Medi Samrat
Published on : 19 Oct 2025 4:55 PM IST

తొలి వన్డేలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం

ఆస్ట్రేలియా జ‌రిగిన తొలి వన్డేలో టీమిండియా ఓట‌మి పాల‌య్యింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. వ‌ర్షం ఆటంకం క‌లిగించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ అత్యధికంగా 38 పరుగులు, అక్షర్ పటేల్ 31 పరుగులు చేశారు. చివ‌ర్లో నితీష్ కుమార్ రెడ్డి అజేయంగా 19 పరుగులు చేసి జట్టు స్కోరును 130కి మించి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత‌ డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 131 పరుగులు చేసి గెలవాలి. ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా 21.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ అడిలైడ్‌లో అక్టోబర్ 23న జరగనుంది.

Next Story