తొలి టెస్టులో లంక చిత్తు.. ఆసీస్ ఘ‌న విజ‌యం

Australia beat Sri Lanka by 10 wickets in Galle.లంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా జ‌ట్టు అద‌ర‌గొట్టింది. వ‌న్డే సిరీస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2022 9:32 AM GMT
తొలి టెస్టులో లంక చిత్తు.. ఆసీస్ ఘ‌న విజ‌యం

లంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా జ‌ట్టు అద‌ర‌గొట్టింది. వ‌న్డే సిరీస్ ఓడినప్ప‌టికి టెస్టు సిరీస్‌ను మాత్రం విజ‌యంతో ఆరంభించింది. గాలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. లంక నిర్దేశించిన 5 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం నాలుగు బంతుల్లో చేధించింది. అంత‌క‌ముందు శ్రీలంక త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 113 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఆసీస్‌ స్పిన్నర్లు నాథన్‌ లయాన్‌, హెడ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకను చావు దెబ్బ తీశారు. కరుణ రత్నే 23 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 313/8 తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. దీంతో 109 ప‌రుగుల కీల‌క తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆసీస్‌కు ల‌భించింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో గ్రీన్‌(77), ఖావాజా(71) రాణించారు. లంక బౌల‌ర్లో ఆర్‌ మెండీస్‌ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు తీశారు. శ్రీలంక త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 212 ప‌రుగుల‌కు ఆలౌటైంది. జులై 8న ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.

Next Story
Share it