ఐర్లాండ్ పై ఆసీస్ విజయం

Australia beat Ireland by 42 runs. ఐర్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం

By Medi Samrat  Published on  31 Oct 2022 1:00 PM GMT
ఐర్లాండ్ పై ఆసీస్ విజయం

ఐర్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసిన ఆసీస్ జట్టు.. ఆపై ఐర్లాండ్ ను 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్యాట్ కమిన్స్, మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు సాధించగా, స్టొయినిస్ 1 వికెట్ తీశాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లొర్కాన్ టకర్ ఒంటరిపోరాటం చేశాడు. టకర్ 48 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు.

గబ్బా మైదానం వేదికగా సాగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ఐర్లాండ్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్ కేవలం 3 పరుగులకే అవుట్ కాగా, మిచెల్ మార్ష్ తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఫించ్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు చేశాడు. మార్ష్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు సాధించాడు. మ్యాక్స్ వెల్ (13) మరోసారి విఫలమవ్వగా.. మార్కస్ స్టొయినిస్ 25 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 15, మాథ్యూ వేడ్ 7 పరుగులతోనూ నాటౌట్ గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్ కార్తీ 3, జోష్ లిటిల్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సూపర్-12 గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆసీస్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.


Next Story
Share it